తాహీర్ తడాఖా.. | imran tahir gets firts three wickets against mumbia indians | Sakshi
Sakshi News home page

తాహీర్ తడాఖా..

Apr 6 2017 8:43 PM | Updated on Sep 5 2017 8:07 AM

తాహీర్ తడాఖా..

తాహీర్ తడాఖా..

ఐపీఎల్ -10 సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ అద్భుతమైన బౌలింగ్ తో చెలరేగిపోతున్నాడు.

పుణె: ఐపీఎల్ -10 సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్  అద్భుతమైన బౌలింగ్ తో చెలరేగిపోతున్నాడు. ముంబై ఇండియన్స్ ను వణికిస్తూ తొలి మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. పార్థీవ్ పటేల్(19), రోహిత్ శర్మ(3), జాస్ బట్లర్(38) వికెట్లను సాధించి ముంబైకు షాకిచ్చాడు.

ముంబై ఇండియన్స్ మంచి దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తాహీర్ తన మ్యాజిక్ ను ప్రదర్శించాడు. దాంతో ముంబై 62 పరుగులకు మూడు వికెట్లను నష్టపోయింది. ఈ ఐపీఎల్ వేలంలో తాహీర్ ను ఎవరూ కొనగోలు చేయని సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ ఆరంభానికి కొన్ని రోజులు ముందు ఈ నంబర్ వన్ వన్డే బౌలర్ ను పుణె జట్టులోకి తీసుకుంది. జట్టు పెట్టుకున్న ఆశల్ని నిజం చేస్తూ తొలి మ్యాచ్ లోనే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు తాహీర్. ఈ మ్యాచ్ లో రెండు ఓవర్లు బౌలింగ్ ను పూర్తి చేసిన తరువాత మూడు వికెట్లను తీసిన తాహీర్ తొమ్మిది పరుగుల్ని మాత్రమే ఇవ్వడం ఇక్కడ మరో విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement