శ్రీకాంత్‌గా నటించడం ఓ వరం

Iam Very Lucky To Act In Srikanth's Role, Jeeva - Sakshi

చెన్నై: ప్రఖ్యాత క్రికెట్‌ క్రీడాకారుడు కృష్ణమాచారి శ్రీకాంత్‌గా నటించడం వరం అని యువ నటుడు జీవా పేర్కొన్నారు. పూర్వ భారత క్రికెట్‌ క్రీడా జట్టు కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ బయోపిక్‌ను 83 పేరుతో చిత్రంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. 1983లో కపిల్‌దేవ్‌ కెప్టెన్సీలో ప్ర పంచకప్‌ను సాధించిన జట్టులో కృష్ణమాచారి శ్రీ కాంత్‌ భాగస్వామ్యం ఎంతో ఉందన్నది అందరికీ తెలిసిందే. తమిళనాడుకు చెందిన ఆయన ఒక క్రికె ట్‌ క్రీడాకారుడిగా తమిళనాడుకు పేరు తీసుకొచ్చారు. కాగా ఈ 83 చిత్రంలో కృష్ణమాచారి శ్రీ కాంత్‌ పాత్రలో నటుడు జీవా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆ పాత్రకు నటుడు జీవాను ఎంచుకోవ డం గురించి చిత్ర దర్శకుడు కబీర్‌ఖాన్‌ తెలుపుతూ చిత్రంలో కృష్ణమాచారి శ్రీకాంత్‌ గురించి ఆ లోచించగా ఆయన చలాకీతనం, వేగం, బ్యాటింగ్‌లో తనదైన స్టైల్‌ ప్ర ధానాంశాలు అనిపించాయన్నారు. అదేవిధంగా 1983లో ప్రపంచకప్‌ ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్న 83 చిత్రంలో అప్పటి జట్టులో ఉన్న వారి పాత్రల్లో నటులను ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు తెలిపారు. 

అప్పుడు కృష్ణమా చారి శ్రీకాంత్‌  పాత్రలో ఎవరిని నటింపజేయాలన్న విషయంలో ఆయన మా దిరి చలాకీగా ఉండే నటుడి కోసం అన్వేషించగా నటుడు జీవా బాగా నప్పుతారని భావించామన్నారు. జీవాలోనూ మంచి క్రికెట్‌ క్రీడాకారుడు ఉండటంతో 83 చిత్రానికి మరింత బలం చేకూరిందని చెప్పారు. కాగా కృష్టమాచారి శ్రీకాంత్‌ బ్యాటింగ్‌ స్టైల్‌ ను అనుచరించడం కోసం జీవా చాలా శిక్షణ తీసుకున్నట్లు చెప్పారు. ఆ పాత్రలో జీవా కచ్చితంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారని దర్శకుడు అన్నారు. కాగా కృష్ణమాచారి శ్రీకాంత్‌ పాత్రలో నటించడం గురించి జీవా మాట్లాడు తూ  క్రికెట్‌ క్రీడ అంటే తనకు చిన్న వయసు నుంచే ఇష్టం అన్నారు. అలాంటిది 83 చిత్రంలో కృష్ణమా చారి శ్రీకాంత్‌ పాత్రలో నటించే అవకాశం వెతుక్కుంటూ రావడంతో పట్టరాని ఆనందం కలిగిందన్నారు. తన జీవితంలో రెండు లక్ష్యాలు ఒకే సా రి నెరవేరుతున్నట్లు భావన కలిగిందని అన్నా రు. నటుడు అయిన తరువాత తనకు ఇష్టమైన రంగం క్రికెట్‌ అని పేర్కొన్నారు. క్రికెట్‌ క్రీడ వి ధి విధానాలను తమిళనాడులో పరిచయం చే సింది కృష్ణమాచారి శ్రీకాంత్‌నేనని అన్నారు. అలాంటి పాత్రలో నటించడం తనకు వరం లాంటిదని జీవా పేర్కొన్నారు. ఈ పాత్రకు తనను ఎంపిక చేసిన దర్శకుడు కబీర్‌ ఖాన్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాన ని అన్నారు. ఇక ఇండియాలో అత్యంత ప్రతిభావంతుడైన నటుడు రణ్‌వీర్‌సింగ్‌తో కలసి ఈ చిత్రంలో నటించడం మరచిపోలేని అనుభవంగా పేర్కొన్నా రు. కాగా 83 చిత్రం సమ్మర్‌ స్పెషల్‌గా ఏప్రిల్‌ 20న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top