హైదరాబాద్‌ జట్లకు టైటిల్స్‌ | hyderabad teams won basket ball titles | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ జట్లకు టైటిల్స్‌

Sep 12 2017 10:42 AM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్‌ జట్లకు టైటిల్స్‌ - Sakshi

హైదరాబాద్‌ జట్లకు టైటిల్స్‌

తెలంగాణ రాష్ట్ర అంతర్‌ జిల్లా సబ్‌ జూనియర్‌ బాస్కెట్‌బాల్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ బాలబాలికల జట్లు విజేతలుగా నిలిచాయి.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అంతర్‌ జిల్లా సబ్‌ జూనియర్‌ బాస్కెట్‌బాల్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ బాలబాలికల జట్లు విజేతలుగా నిలిచాయి. జగిత్యాలలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో రెండు విభాగాల్లోనూ డిఫెండింగ్‌ చాంపియన్స్‌ రంగారెడ్డి, కరీంనగర్‌లను ఓడించి టైటిళ్లను గెలుచుకున్నాయి.

 

బాలుర ఫైనల్లో హైదరాబాద్‌ 45–12తో రంగారెడ్డి జట్టుపై గెలుపొందగా, బాలికల ఫైనల్లో హైదరాబాద్‌ 30–15తో కరీంనగర్‌ను ఓడించింది. మూడో స్థానం కోసం జరిగిన పోటీల్లో బాలుర విభాగంలో వరంగల్‌ 38–27తో నిజామాబాద్‌పై, బాలికల విభాగంలో మహబూబ్‌నగర్‌ 30–20తో రంగారెడ్డిపై గెలుపొందాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement