రన్నరప్ హైదరాబాద్ నవాబ్స్ | hyderabad settles as runner up in imbl league | Sakshi
Sakshi News home page

రన్నరప్ హైదరాబాద్ నవాబ్స్

Sep 24 2016 12:05 PM | Updated on Sep 4 2018 5:24 PM

ఇండియన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐఎంబీఎల్)లో హైదరాబాద్ నవాబ్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది.

సాక్షి, హైదరాబాద్: ఇండియన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐఎంబీఎల్)లో హైదరాబాద్ నవాబ్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. తమిళనాడులోని తిర్పూర్‌లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో ఢిల్లీ డెవిల్స్ జట్టు విజేతగా నిలిచింది. ఈ నెల 16 నుంచి 19 వరకు జరిగిన ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొన్నాయి.

 

దాదాపు 60 మంది జాతీయ బ్యాడ్మింటన్ ఆటగాళ్లు ఈ టోర్నీలో తలపడగా... మనోజ్‌కుమార్, నీలిమ చౌదరీ, కమలాకర్, రాజు సునీల్, కిషోర్ కుమార్, ఉదయ్ భాస్కర్, మూర్తిలతో కూడిన హైదరాబాద్ నవాబ్స్ జట్టు రెండో స్థానంతో సరిపెట్టుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement