నేటి నుంచి బ్యాడ్మింటన్ టోర్నీ | hyderabad district badminton championship starts today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి బ్యాడ్మింటన్ టోర్నీ

Jul 25 2016 3:29 PM | Updated on Sep 4 2018 5:21 PM

నేటి నుంచి హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ జరగనుంది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు నిర్వహిస్తారు.

సాక్షి, హైదరాబాద్: నేటి నుంచి హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ జరగనుంది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు నిర్వహిస్తారు. అండర్-13, 15, 17, 19 బాలబాలికల విభాగాలతో పాటు, మహిళలు, వెటరన్ కేటగిరీల్లో మూడు రోజుల పాటు పోటీలు జరుగుతాయి.

 

సోమవారం జరిగే ఈవెంట్ ఆరంభోత్సవ కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి. జనార్ధన్ రెడ్డి హాజరుకానున్నట్లు జిల్లా సంఘం కార్యదర్శి కుంతా పాణీరావు ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు 94400-65604 ఫోన్‌నంబర్లో సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement