విజేతలు హైదరాబాద్, రంగారెడ్డి | Hyderabad and Rangareddy won Sepak takraw titles | Sakshi
Sakshi News home page

విజేతలు హైదరాబాద్, రంగారెడ్డి

Sep 25 2017 10:52 AM | Updated on Sep 25 2017 10:52 AM

Hyderabad and Rangareddy won Sepak takraw titles

సాక్షి, హైదరాబాద్‌: అంతర్‌ జిల్లా సీనియర్‌ మహిళల, పురుషుల సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్, రంగారెడ్డి జట్లు విజేతలుగా నిలిచాయి. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన పురుషుల ఫైనల్లో హైదరాబాద్‌ జట్టు 21–15తో ఆదిలాబాద్‌పై గెలుపొందింది. ఈ విభాగంలో నిజామాబాద్‌ జట్టు మూడో స్థానంలో నిలిచింది. మహిళల టైటిల్‌ పోరులో రంగారెడ్డి 21–16తో హైదరాబాద్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. ఆదిలాబాద్‌కు మూడో స్థానం దక్కింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ‘శాట్స్‌’ చైర్మన్‌ ఎ. వెంకటేశ్వర్‌ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ అధ్యక్షుడు ప్రేమ్‌రాజ్, కోశాధికారి మహేశ్, సెపక్‌తక్రా క్రీడాకారుడు శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement