హరికృష్ణకు వరుసగా ఆరో ‘డ్రా’ | Harikrishna draws his match in Tata Steel Chess | Sakshi
Sakshi News home page

హరికృష్ణకు వరుసగా ఆరో ‘డ్రా’

Jan 28 2017 1:20 AM | Updated on Sep 5 2017 2:16 AM

హరికృష్ణకు వరుసగా ఆరో ‘డ్రా’

హరికృష్ణకు వరుసగా ఆరో ‘డ్రా’

టాటా స్టీల్‌ మాస్టర్స్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ ఖాతాలో వరుసగా ఆరో ‘డ్రా’ చేరింది.

టాటా స్టీల్‌ మాస్టర్స్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ ఖాతాలో వరుసగా ఆరో ‘డ్రా’ చేరింది. నెదర్లాండ్‌్సలోని విక్‌ ఆన్  జీ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం అనీష్‌ గిరి (నెదర్లాండ్‌్స)తో జరిగిన 11వ రౌండ్‌ గేమ్‌లో నల్లపావులతో ఆడిన హరికృష్ణ 36 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. 14 మంది గ్రాండ్‌మాస్టర్లు తలపడుతున్న ఈ టోర్నీలో 11వ రౌండ్‌ తర్వాత హరికృష్ణ 5.5 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఈ టోర్నీలో మరో రెండు రౌండ్‌లు మిగిలి ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement