హారిక తొలి గెలుపు

Harika dronavalli win the first match - Sakshi

సెయింట్‌ లూయిస్‌ (అమెరికా): కెయిన్స్‌ కప్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ‘డ్రా’ల పరంపరకు తెరదించుతూ ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక తొలి విజయం నమోదు చేసింది. జన్‌సాయా అబ్దుమలిక్‌ (కజకిస్తాన్‌)తో జరిగిన ఆరో రౌండ్‌ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హారిక 79 ఎత్తుల్లో గెలుపొందింది.

పది మంది క్రీడాకారిణుల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ఆరో రౌండ్‌ తర్వాత హారిక 3.5 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచ మాజీ చాంపియన్‌ అలెగ్జాండ్రా కొస్టెనిక్‌ (రష్యా), వాలెంటినా గునీనా (రష్యా) ఐదు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top