
హార్దిక్ పాండ్యా
లండన్: భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా టెస్టుల్లో ఆల్‌రౌండర్ కాదని వెస్టిండీస్ బౌలింగ్ దిగ్గజం మైకేల్ హోల్డింగ్ అభిప్రాయపడ్డారు. ఆల్‌రౌండర్ స్థానాన్ని భర్తీ చేసే నైపుణ్యం అతనిలో లేదన్నారు. ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుత భారత టెస్టు జట్టు సమతూకంగా లేదు. పాండ్యాను ఆల్‌రౌండర్ స్థానంతో భర్తీ చేస్తున్నారు. కానీ అతని బౌలింగ్‌లో పసలేదు. బ్యాటింగ్‌లో నిలకడ లేదు. మొత్తానికి టెస్టుల్లో అతను ప్రభావవంతమైన ఆటగాడేమీ కాదు. పాండ్యా ఆల్‌రౌండరే అయితే సెంచరీలు సాధించకపోయినా... కనీసం 60, 70 పరుగులైనా చేయాలి. బౌలింగ్‌లో వికెట్లు తీయాలి. అలా కాకుండా ఎపుడో ఒకసారి 2, 3 వికెట్లు తీస్తే సరిపోతుందా? ఇది ఆల్‌రౌండర్ ప్రదర్శన కానే కాదు’ అని తెలిపారు.