కొరియా ఓపెన్ లో ముగిసిన భారత్ పోరాటం | gutta Jwala and Ashwini pair lose as Indian challenge ends | Sakshi
Sakshi News home page

కొరియా ఓపెన్ లో ముగిసిన భారత్ పోరాటం

Jan 9 2014 8:45 PM | Updated on Sep 2 2017 2:26 AM

కొరియా ఓపెన్ లో ముగిసిన భారత్ పోరాటం

కొరియా ఓపెన్ లో ముగిసిన భారత్ పోరాటం

కొరియా ఓపెన్ లో భారత బ్యాడ్మింటన్ పోరాటం ముగిసింది.

సియోల్: కొరియా ఓపెన్ లో భారత బ్యాడ్మింటన్ పోరాటం ముగిసింది. డబుల్స్ విభాగంలో గురువారం జరిగిన రెండో రౌండ్ లో భారత్ షట్లర్లు గుత్తా జ్వాల-అశ్విన్ పొన్నప్ప జోడీలకు పరాభవం ఎదురుకావడంతో టోర్నీ నుంచి నిష్ర్కమించారు. యా నా జాంగ్, యంగ్ కిమ్ ల జోడీ చేతిలో 21-18,21-12 తేడాతో జ్వాల-అశ్వినిలు ఓటమి పాలైయ్యారు. మరోప్రక్క మిక్సిడ్ డబుల్స్ లో తరుణ్- కోనా జంట 10-21, 15-21 తేడాతో జర్మనీ జంట మైఖేల్ ఫక్స్, బిర్జిట్ మైఖేల్స్ చేతిలో చుక్కెదురైంది.

 

వీరి ఓటమితో భారత్ పోరు ఆదిలోనే ముగిసినట్టయ్యింది. ముందురోజు మహిళల విభాగంలో మెరుపించి రెండో రౌండ్ కు చేరుకున్నగుత్తా జ్వాల-అశ్విని పొనప్ప జోడి ఈ గేమ్ లో కనీసం పోరాట పటిమను కూడా కనబరచకుండా ఓటమి చెందారు.  అయితే పురుషుల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాతీయ చాంపియన్ కిడాంబి శ్రీకాంత్, గురుసాయిదత్ తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించారు.

Advertisement
 
Advertisement
Advertisement