ధోనీపై సురేష్ రైనాదే పైచేయి | Gujarat Lions beats Rising Pune Supergiants by 7 wickets | Sakshi
Sakshi News home page

ధోనీపై సురేష్ రైనాదే పైచేయి

Apr 14 2016 11:25 PM | Updated on Aug 21 2018 2:28 PM

ధోనీపై సురేష్ రైనాదే పైచేయి - Sakshi

ధోనీపై సురేష్ రైనాదే పైచేయి

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో కొత్త జట్టు గుజరాత్ లయన్స్ వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది.

రాజ్కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో కొత్త జట్టు గుజరాత్ లయన్స్ వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో భాగంగా గురువారం రాత్రి ఇక్కడ పుణె సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపొందింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లయన్స్ మరో 12 బంతులు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. రెండు కొత్త జట్ల మధ్యపోరులో ధోనీ నేతృత్వంలోని పుణెపై సురేష్ రైనా జట్టు గుజరాత్ లయన్స్ పైచేయి సాధించింది. లయన్స్ జట్టుకు ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (50 పరుగులు; 36 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రెండన్ మెకల్లమ్ (49 పరుగులు; 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. గుజరాత్ కెప్టెన్ సురేష్ రైనా 24 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో స్టంప్ అవుటయ్యాడు. చివర్లో బ్రావో (22 పరుగులు; 10 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపులు మెరిపించాడు. పుణె బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టగా, ఇషాంత్ శర్మకు ఓ వికెట్ దక్కింది.
 
 
పుణె ఇన్నింగ్స్: 
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పుణె ఇన్నింగ్స్ ను అజింక్యా రహానే, డు ప్లెసిస్లు దాటిగా ఆరంభించారు. అయితే జట్టు స్కోరు 27 పరుగుల వద్ద రహానే(21) తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. అనంతరం డు ప్లెసిస్-కెవిన్ పీటర్సన్ల జంట స్కోరు బోర్డును వేగంగా ముందుకు కదిలించింది.  ఈ జోడి 86 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో 12.0 ఓవర్లు ముగిసే సరికి పుణె వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది. పుణె జట్టులో డు ప్లెసిస్ (69;43 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు), పీటర్సన్(37;31 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్), మహేంద్ర సింగ్ ధోని(22 నాటౌట్;10 బంతుల్లో 2 ఫోర్లు,1 సిక్స్)లు రాణించడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. కాగా, పీటర్సన్, డు ప్లెసిస్లు 19 పరుగుల వ్యవధిలో నిష్క్రమించిన తరువాత స్టీవ్ స్మిత్(5), మిచెల్ మార్ష్(7) లు నిరాశపరచడంతో పుణె స్కోరు మందగించింది. గుజరాత్ లయన్స్ బౌలర్లలో తాండే, జడేజాలకు తలో రెండు వికెట్లు దక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement