జిబ్రాల్టర్ చెస్ టోర్నీలో హరికృష్ణకు ఐదో స్థానం | Gibraltar chess tournament harikrishna fifth place | Sakshi
Sakshi News home page

జిబ్రాల్టర్ చెస్ టోర్నీలో హరికృష్ణకు ఐదో స్థానం

Feb 5 2016 12:05 AM | Updated on Aug 29 2018 1:16 PM

జిబ్రాల్టర్ చెస్ టోర్నీలో హరికృష్ణకు ఐదో స్థానం - Sakshi

జిబ్రాల్టర్ చెస్ టోర్నీలో హరికృష్ణకు ఐదో స్థానం

ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ జిబ్రాల్టర్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో ఐదో స్థానాన్ని సంపాదించాడు.

ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ జిబ్రాల్టర్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో ఐదో స్థానాన్ని సంపాదించాడు. గురువారం ముగిసిన ఈ టోర్నీలో హరికృష్ణ ‘మాస్టర్స్’ విభాగంలో 7.5 పాయింట్లు సాధించి మరో ఐదుగురితో కలిసి ఉమ్మడిగా మూడో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా... హరికృష్ణకు ఐదో స్థానం దక్కింది. భారత్‌కే చెందిన సేతురామన్ 4వ, అభిజిత్ గుప్తా 10వ, విదిత్ 18వ, లలిత్‌బాబు 30వ, సందీపన్ చందా 39వ, విశ్వనాథన్ ఆనంద్ 41వ స్థానాల్లో నిలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement