జీసీపీఈ జట్టుకు టైటిల్‌ | GCPE Team won Kho Kho Title | Sakshi
Sakshi News home page

జీసీపీఈ జట్టుకు టైటిల్‌

Oct 9 2018 10:28 AM | Updated on Oct 9 2018 10:28 AM

GCPE Team won Kho Kho Title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్‌ కాలేజి పురుషుల ఖో–ఖో టోర్నమెంట్‌లో జీసీపీఈ దోమలగూడ జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది. కేశవ్‌ మెమోరియల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజి (నారాయణగూడ) ప్రాంగణంలో జరిగిన ఈ టోర్నీలో జీసీపీఈ జట్టు విజేతగా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో జీసీపీఈ 8–7తో నిజాం కాలేజిపై గెలుపొందింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో సిద్ధార్థ కాలేజి 8–1తో భవన్స్‌ న్యూ సైన్స్‌ (నారాయణగూడ) జట్టును ఓడించింది.

అంతకుముందు జరిగిన సెమీస్‌ మ్యాచ్‌ల్లో నిజాం 14–9తో భవన్స్‌పై, జీసీపీఈ 14–7తో సిద్ధార్థ జట్లపై గెలుపొందాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో కేశవ్‌ మెమోరియల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ సంయుక్త కార్యదర్శి శ్రీధర్‌ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement