సన్నీ, మంజ్రేకర్‌లకు తృటిలో తప్పిన ప్రమాదం

Gavaskar, Manjrekar Escape Unhurt After Glass Door Of Commentary Box Shatters - Sakshi

లక్నో : భారత్‌, వెస్టిండీస్‌ల మధ్య లక్నోలో మంగళవారం జరిగిన రెండో టీ 20 మ్యాచ్‌ సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. నూతనంగా నిర్మించిన అటల్‌ బిహారి వాజ్‌పేయి అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ​నిర్వహణ లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. కామెంటరీ బాక్స్‌లోకి సునీల్‌ గావస్కర్‌, సంజయ్‌ మంజ్రేకర్‌లు చేరుకున్న కొద్దిసేపటికే గ్లాస్‌ డోర్స్‌ పగిలాయి. ఈ ఘటన నుంచి వారు త్రుటిలో తప్పించుకున్నారు. తాము లోపలికి ప్రవేశించగానే గ్లాస్‌ డోర్స్‌లో ఒకటి కుప్పకూలిందని అదృష్టవశాత్తూ తామంతా క్షేమంగా ఉన్నామని మంజ్రేకర్‌ చెప్పుకొచ్చారు.

కాగా ఇకానా స్పో‍ర్ట్స్‌ సిటీలోని ఈ స్టేడియం ప్రైవేట్‌ ఆస్ధి కావడంతో తామేమీ చేయలేమని యూపీ క్రికెట్‌ అసోనియేషన్‌ అధికారులు పేర్కొన్నారు. మ్యాచ్‌ను కవర్‌ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులు సైతం స్టేడియం నిర్వాహకుల వైఫల్యంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మీడియా బాక్స్‌లో ఏర్పాటు చేసిన ఇంటర్‌నెట్‌, వపర్‌ కనెక్షన్లు లోపభూయిష్టంగా ఉండటంతో పాటు పలుమార్లు విద్యుత్‌ సరఫరాలో అవాంతరాలు ఎదురవడంతో మీడియా ప్రతినిధులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top