న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ మృతి

Former New Zealand test cricket captain Bevan Congdon dies - Sakshi

అక్లాండ్: న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్‌, మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి మరింత విషమించడంతో తుదిశ్వాస విడిచారు. 1965లో క్రికెట్‌లో అరంగేట్రం చేసిన బెవాన్‌ తన 13 ఏళ్ల కెరీర్‌లో మొత్తం 61 టెస్టులు ఆడారు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడాన్ని ఇష్టపడే బెవాన్ 32.22 సగటుతో 3,448 పరుగులు చేశారు. ఇందులో ఏడు సెంచరీలు ఉన్నాయి. 17 టెస్టులకు సారథ్య బాధ్యతలు వహించిన బెవాన్ ఆస్ట్రేలియాపై తొలి టెస్టు విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించారు. 

పాకిస్థాన్‌తో న్యూజిలాండ్‌ ఆడిన తొలి అంతర్జాతీయ వన్డేకు బెవాన్‌ నాయకత్వం వహించారు.11 వన్డేల్లో 56.33 సగటుతో ఐదు అర్ధ సెంచరీలు, ఓ సెంచరీ నమోదు చేశారు. న్యూజిలాండ్ తరపున పది ఇన్నింగ్స్‌లలో ఇప్పటికీ ఇదే అత్యుత్తమ సగటు కావడం విశేషం. బెవాన్ మృతితో న్యూజిలాండ్ అభిమానులు, ఆటగాళ్లు శోకసంద్రంలో మునిగిపోయారు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top