మహిళల 100 మీటర్ల రేసులో ద్యుతీచంద్‌కు స్వర్ణం  | Dueti chandu gold in the women's 100 meter race | Sakshi
Sakshi News home page

మహిళల 100 మీటర్ల రేసులో ద్యుతీచంద్‌కు స్వర్ణం 

Feb 28 2018 1:47 AM | Updated on Feb 28 2018 1:47 AM

Dueti chandu  gold in the women's 100 meter race - Sakshi

ద్యుతీచంద్‌

స్వదేశీ అథ్లెట్ల మధ్య నిర్వహిస్తున్న ఇండియన్‌ గ్రాండ్‌ప్రి–1 అథ్లెటిక్స్‌ మీట్‌లో ఒడిశా స్టార్‌ క్రీడాకారిణి ద్యుతీచంద్‌ స్వర్ణ పతకాన్ని సాధించింది. పాటియాలాలో మంగళవారం జరిగిన మీట్‌లో ద్యుతీ... 100 మీటర్ల దూరాన్ని 11.57 సెకన్లలో అధిగమించి విజేతగా నిలిచింది.

ప్రస్తుతం ద్యుతీచంద్‌ తెలంగాణకు చెందిన కోచ్‌ నాగపురి రమేశ్‌ వద్ద శిక్షణ తీసుకుంటోంది. ఇదే మీట్‌లో పురుషుల జావెలిన్‌ త్రోలో ఆసియా చాంపియన్‌ నీరజ్‌ చోప్రా పసిడి పతకం గెలిచాడు. అతను జావెలిన్‌ను 82.88 మీటర్ల దూరం విసిరాడు.    

Advertisement
 
Advertisement
Advertisement