ఐపీఎల్‌లో డీఆర్‌ఎస్‌  | DRS to be implemented in IPL 2018: report | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌లో డీఆర్‌ఎస్‌ 

Mar 1 2018 1:26 AM | Updated on Mar 1 2018 1:26 AM

DRS to be implemented in IPL 2018: report - Sakshi

అంపైర్‌ నిర్ణయ సమీక్ష పద్ధతి

న్యూఢిల్లీ: అంపైర్‌ నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్‌ఎస్‌)ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోన్న భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్‌లో దానికి ఆమోదం తెలిపింది. ఏప్రిల్‌లో ప్రారంభంకానున్న ఐపీఎల్‌–11తో ఈ లీగ్‌లో డీఆర్‌ఎస్‌ను ప్రవేశపెట్టనుంది. కచ్చితమైన నిర్ణయాల విషయంలో లోపాలున్న కారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనే డీఆర్‌ఎస్‌ను వ్యతిరేకించిన బీసీసీఐ తమ సొంత లీగ్‌లో దీనికి పచ్చజెండా ఊపడం గమనార్హం. ‘బీసీసీఐ గత కొంత కాలం నుంచి డీఆర్‌ఎస్‌ను పరిశీలిస్తోంది.

ఐపీఎల్‌లో ప్రవేశ పెట్టాలని మాత్రం ఈ ఏడాదే నిర్ణయించింది. మిగతా అన్నింట్లో అత్యుత్తమ పద్ధతులను అవలంభిస్తున్నప్పుడు డీఆర్‌ఎస్‌ విషయంలో ఎందుకు అమలు చేయకూడదు?’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అంపైర్‌గా మారిన ఆస్ట్రేలియా పేసర్‌ పాల్‌ రైఫిల్‌ ఆధ్వర్యంలో గతేడాది  విశాఖపట్నంలో 10 మంది భారత దేశవాళీ అంపైర్లకు డీఆర్‌ఎస్‌పై శిక్షణ తరగతులు నిర్వహించారు.    

Advertisement
 
Advertisement
Advertisement