'ధోనితో అతన్ని పోల్చకండి' | Do not compare MS Dhoni with Hardik Pandya | Sakshi
Sakshi News home page

'ధోనితో అతన్ని పోల్చకండి'

Oct 7 2017 9:20 PM | Updated on Oct 8 2017 2:50 AM

Do not compare MS Dhoni with Hardik Pandya

న్యూఢిల్లీ:ఇటీవల కాలంలో టీమిండియా మ్యాచ్ లకు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా  మంచి ఫినిషింగ్ టచ్ ఇస్తున్న సంగతి తెలిసిందే. క్రికెట్ లో అడుగుపెట్టిన అనతికాలంలోనే పాండ్యా తనదైన మార్కును చూపెడుతూ కీలక ఆటగాడిగా మారిపోయాడు. అయితే మ్యాచ్ లను ముగించే విషయంలో మహేంద్ర సింగ్ ధోనితో హార్దిక్ పాండ్యాను పోల్చడంపై భారత మాజీ క్రికెటర్ కర్సన్ ఘావ్రి తీవ్ర అసహన వ్యక్తం చేశాడు. అసలు ధోనితో పోలిక తేవడానికి హార్దిక్ అనుభవం ఎంతమాత్ర సరిపోదన్నాడు.

'కొంతకాలంగా హార్దిక్ మ్యాచ్ ల్ని ముగిస్తుండొచ్చు.. కానీ ధోనితో పోల్చదగిన మ్యాచ్ ఫినిషర్ మాత్రం కాదు. ధోని చేసిన పరుగులు, అనుభవానికి హార్దిక్ పాండ్యా ఇంకా చాలా దూరంలో ఉన్నాడు. దయచేసి ధోనితో పాండ్యాను పోల్చి చూడకండి. అతనికి మంచి భవిష్యత్తు ఉంది. హార్దిక్ ఇంకా నిరూపించుకునే దశలోనే ఉన్నాడు. ధోని ఇప్పటికే నిరూపించుకుని ఆమడంత దూరంలో ఉన్నాడు. ఇప్పుడు ప్రత్యేకంగా మ్యాచ్ ను ఫినిష్ చేయడంలో ధోనికి ప్రత్యేకంగా పరీక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. హార్దిక్ కంటే ధోని వెయ్యి రెట్లు బెటర్ అనే సంగతి పోల్చే వాళ్లు తెలుసుకోవాలి'అని ఘావ్రి విమర్శించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement