‘నేను నా డ్రాగన్‌’: కార్తీక్‌

Dinesh Karthik Posts Adorable Message For Wife Dipika Pallikal - Sakshi

కోహ్లి-అనుష్క, ధోని-సాక్షిలాగా సెలబ్రిటీ జంట కాదు ఈ జంట. కానీ వీరిద్దరూ టీమిండియా తరుపున ప్రాతినిథ్యం వహిస్తూ ఎన్నో మరుపురాని విజయాలు అందించారు. ఒకరు నిదహాస్‌ ట్రోఫీలో చివరి బంతికి సిక్స్‌ కొట్టి భారత్‌కు కప్‌ అందించిన వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ కాగా మరోకరు స్టార్‌ స్క్వాష్‌ ప్లేయర్‌ దీపికా పల్లికల్‌. వీరిరువురు తీరిక లేకుండా వారివారి ఆటల్లో బిజీగా ఉండటంతో అందరిలగా బయట ఎక్కువగా కనిపించరు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ అనంతరం కాస్త ఖాళీ సమయం దొరకడంతో తన సతీమణితో కలిసి డెన్మార్క్‌ వీధుల్లో విహరిస్తున్నాడు ఈ సీనియర్‌ వికెట్‌ కీపర్‌‌. వీరిరువురు కలిసి దిగిన ఫోటోను దినేశ్‌ కార్తీక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. అంతేకాకుండా ‘నేను నా డ్రాగన్‌’ అంటూ పోస్ట్‌ చేశాడు. వీరు మరీ అంతగా సెలబ్రిటీ జంట కాకపోవడంతో అంతగా వైరల్‌ అవ్వలేదు. కానీ చూపరులను మాత్రం ఈ ఫోటో తెగ ఆకట్టుకోంటోంది. 

కార్తీక్‌ ఆకట్టుకుంటాడా.. ఇంగ్లండ్‌ గడ్డపై టీమిండియా చివరిసారి 2007లో రాహుల్‌ ద్రవిడ్‌ సారథ్యంలో టెస్టు సిరీస్‌ గెలిచింది. వసీం జాఫర్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన కార్తీక్‌ ఈ టెస్టు సిరీస్‌లో అకట్టుకున్నాడు. ఈ సిరీస్‌లో టీమిండియా తరుపున అత్యధిక పరుగుల చేసింది కార్తీక్‌ కావడం విశేషం. ఇంగ్లండ్‌ సిరీస్‌ అనంతరం వరుస వైపల్యాలతో జట్టులో చోటు కోల్పోయిన కార్తీక్‌ దాదాపు ఎనిమిది సంవత్సరాల తరువాత తిరిగి టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్నాడు. రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌ వృద్దిమాన్‌ సాహా గాయపడటంతో ఈ సీనియర్‌ ఆటగాడు అఫ్గనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో చోటు దక్కించుకున్నాడు. గాయం నుంచి సాహా కోలుకోకపోవడంతో కీలక ఇంగ్లండ్‌ పర్యటనకు కూడా కార్తీక్‌ వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు. ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌లో  దినేశ్‌ కార్తీక్‌ మరోసారి ఆకట్టుకుంటాడా? టీమిండియా చరిత్ర మరోసారి పునరావృతం చేస్తుందా వేచి చూడాలి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top