
సాక్షి, న్యూఢిల్లీ : న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టీ20లో మ్యాచ్ లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ధావన్ (63 నాటౌట్), మరో ఓపెనర్ రోహిత్ శర్మ(43 నాటౌట్) రాణిస్తున్నారు. శిఖర్ చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డులో వేగం పెంచాడు. శాంట్నర్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో సింగిల్ తీసిన ధావన్ అర్థ శతకాన్ని నమోదు చేశాడు. 13 ఓవర్లలో భారత్ స్కోరు 114/0.