చివరి నిమిషంలో గోల్ చేసిన ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ జట్టు ఓటమి నుంచి గట్టెక్కింది.
న్యూఢిల్లీ: చివరి నిమిషంలో గోల్ చేసిన ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ జట్టు ఓటమి నుంచి గట్టెక్కింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) రెండో సీజన్‌లో ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న ఢిల్లీ గురువారం కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌ను 3-3తో డ్రా చేసుకుంది. అయితే మ్యాచ్ చివరి వరకు ఆధిక్యంలో ఉన్న కేరళ చివర్లో తడబడి ఓటమితో సీజన్‌ను ముగించింది. ఢిల్లీ తరఫున డాస్ సాంటోస్ (7), నబీ (40), షెహనాజ్ (90) గోల్స్ చేయగా... కేరళకు దగ్నల్ (9), కోయింబ్రా (30), జర్మన్ (39) గోల్స్ అందించారు.