కోరిక తీరిస్తే..కొడుకును ఎంపిక చేస్తారట! | DDCA official sought sex for selection, says Arvind Kejriwal | Sakshi
Sakshi News home page

కోరిక తీరిస్తే.. కొడుకును ఎంపిక చేస్తారట!

Dec 29 2015 4:23 PM | Updated on Sep 3 2017 2:46 PM

కోరిక తీరిస్తే..కొడుకును ఎంపిక చేస్తారట!

కోరిక తీరిస్తే..కొడుకును ఎంపిక చేస్తారట!

ఇప్పటికే ఢిల్లీ, ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లో అవినీతి తారాస్థాయికి చేరిందంటూ యుద్ధం ప్రకటించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. మరోసారి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

* డీడీసీఏపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఫైర్
 

న్యూఢిల్లీ: ఇప్పటికే ఢిల్లీ, ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లో అవినీతి తారాస్థాయికి చేరిందంటూ యుద్ధం ప్రకటించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. మరోసారి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. డీడీసీఏలోని అధికారులు సెలక్షన్స్ కోసం వెళ్లిన వారి పట్ల అనైతికంగా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. క్రికెటర్ల ఎంపికలో భాగంగా కొడుకుని తీసుకుని డీడీసీఏ అధికారుల వద్దకు వెళ్లిన ఓ సీనియర్ జర్నలిస్టుకు  ఎదురైన చేదు అనుభవం తాజాగా  తన దృష్టికి వచ్చిందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ పేర్కొన్నారు.


'ఓ సీనియర్ జర్నలిస్టు నా వద్దకు తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా డీడీసీఏలో చోటు చేసుకున్న విషయాల్ని నాతో చర్చించాడు. కుమారుని క్రికెట్ జట్టు సెలక్షన్ కోసం వెళితే అతని భార్యను శారీరక సుఖం కోసం పంపమని ఓ డీడీసీఏ అధికారి అడిగాడట. స్వయంగా అతనే ఈ విషయాన్ని నాతో మొరపెట్టుకున్నాడు. ఆ జర్నలిస్టు పేరును బయటకు చెప్పాలనుకోవడం లేదు. డీడీసీఏలో జరుగుతున్న అవతవకలకు ఇంతకన్నా నిదర్శనమేమిటి?, ఇదొక్కటే కాదు.. ఈ తరహా ఘటనలు అక్కడ అనేకం చోటు చేసుకుంటున్నాయి. 'అని అరవింద్ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. డీడీసీఏలో ఆర్థిక అవకతవకలు అనేది ఒక కోణమైతే..అక్కడ సెక్స్ రాకెట్ లాంటి మరోకోణం నడుస్తుందని కేజ్రీవాల్ విమర్శించారు. ఇప్పటికైనా డీడీసీఏలో అవినీతిపై విచారణను అడ్డుకోవద్దని ప్రధాని నరేంద్ర మోదీకి సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement