ఫెడరర్‌కు షాక్‌ | David Goffin rocks Roger Federer to reach ATP World Tour Finals | Sakshi
Sakshi News home page

ఫెడరర్‌కు షాక్‌

Nov 19 2017 1:09 AM | Updated on Nov 19 2017 3:14 AM

David Goffin rocks Roger Federer to reach ATP World Tour Finals - Sakshi - Sakshi

లండన్‌: టెన్నిస్‌ సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ ఏటీపీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌కు చుక్కెదురైంది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో బెల్జియం ప్లేయర్‌ డేవిడ్‌ గాఫిన్‌ 2–6, 6–3, 6–4తో రెండో ర్యాంకర్‌ ఫెడరర్‌ను బోల్తా కొట్టించి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గతంలో ఫెడరర్‌తో ఆడిన ఆరుసార్లూ ఓటమి పాలైన గాఫిన్‌ ఏడో ప్రయత్నంలో నెగ్గడం విశేషం.

ఐఎస్‌ఎల్‌లో రెండో ‘డ్రా’    
గువాహటి: నాలుగో సీజన్‌ ఐఎస్‌ఎల్‌లో వరుసగా రెండోరోజూ ఒక్క గోల్‌ కూడా లేకుండానే మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసింది. నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌ ఎఫ్‌సీ, జంషెడ్‌పూర్‌ ఎఫ్‌సీ మధ్య జరిగిన మ్యాచ్‌ 0–0తో ‘డ్రా’ అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement