షార్ప్ షూటర్స్ అండర్–17 వన్డే బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో డాన్‌బాస్కో జట్టు సత్తా చాటింది.
అండర్–17 బాస్కెట్‌బాల్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: షార్ప్ షూటర్స్ అండర్–17 వన్డే బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో డాన్‌బాస్కో జట్టు సత్తా చాటింది. సోమవారం జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో 27–22తో గ్లెండెల్ అకాడమీ ‘ఎ’ జట్టుపై గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది. విజేత జట్టు తరఫున ఆకాశ్ 11 పాయింట్లతో చెలరేగగా, నిఖిల్ 8 పాయింట్లతో అండగా నిలిచాడు.
గ్లెండెల్ జట్టు తరఫున మోనిష్ 10 పాయింట్లతో ఆకట్టుకోగా, ఉమేర్ 8 పాయింట్లు సాధించాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో డాన్‌బాస్కో జట్టు 25–18తో ఫ్యూచర్స్ సనత్‌నగర్ జట్టుపై గెలుపొందగా, గ్లెండెల్ అకాడమీ ‘ఎ’ జట్టు 27–24తో షార్ప్ షూటర్స్ జట్టును ఓడించింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో సీనియర్ ఎన్‌ఐఎస్ కోచ్ షంషుద్దీన్ పాల్గొని విజేతలకు ట్రోఫీలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సీసీఓబీ సీనియర్ ఆటగాడు హబీబ్ తదితరులు పాల్గొన్నారు.