వచ్చే నెలలో కృనాల్ పాండ్యా పెళ్లి | Cricketer Krunal Pandya pads up for new innings | Sakshi
Sakshi News home page

వచ్చే నెలలో కృనాల్ పాండ్యా పెళ్లి

Nov 20 2017 4:04 PM | Updated on Nov 20 2017 4:10 PM

Cricketer Krunal Pandya pads up for new innings - Sakshi - Sakshi - Sakshi

న్యూఢిల్లీ: భారత్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాకు సోదరుడైన కృనాల్ పాండ్యా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న కృనాల్..తన గర్ల్‌ఫ్రెండ్‌ పంకురి శర్మను వచ్చే నెల 27వ తేదీన పెళ్లాడబోతున్నాడు.

ముంబయిలోని శాంట క్రూజ్‌ హోటల్‌లో తమ వివాహం జరిగే విషయాన్ని కృనాల్ స్వయంగా వెల్లడించాడు. అతి కొద్దిమంది దగ్గర బంధువుల సమక్షంలో తమ పెళ్లి జరగనున్నట్లు ఈ బరోడా ఆల్ రౌండర్ తెలిపాడు. రెండు సంవత్సరాల క్రితం కృనాల్‌ తొలిసారి పంకురిని కలిశాడు. తన స్నేహితుడి ద్వారా పంకురితో పరిచయం ఏర్పడింది. అనంతరం వీరి స్నేహం పెళ్లికి దారితీసింది. ఎట్టకేలకు ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో  వారి వివాహానికి ముహూర్తం ఖరారైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement