ఆసియా మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆరుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకాలను
న్యూఢిల్లీ: ఆసియా మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆరుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. చైనాలో జరుగుతున్న ఈ పోటీల్లో సర్జూబాల (48 కేజీలు), మీనా కుమారి దేవి (54 కేజీలు), బాసుమత్రి (57 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), స్వీటీ (81 కేజీలు), సీమా పూనియా (ప్లస్ 81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో తమ ప్రత్యర్థులను ఓడించారు.