ఆసియాకప్‌లో భారత్‌ శుభారంభం

Clinical India maul Japan 5-1 in Asia Cup hockey opener

ఆసియా కప్‌లో భారత్‌ బోణి

జపాన్‌పై 5-1తో ఘనవిజయం

ఢాకా: బంగ్లాదేశ్‌ వేదికగా జరుగుతున్న హాకీ ఆసియాకప్‌లో భారత్‌ శుభారంభం చేసింది. నేడు (బుధవారం) జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 5-1తో ఘనవిజయం సాధించింది. మ్యాచ్‌ తొలి అర్థ భాగం నుంచి చివరి వరకు భారత ఆటగాళ్లు ఆధిపత్యాన్ని చలాయించారు. భారత ఆటగాడు ఎస్‌వీ సునీల్‌ మూడో నిమిషంలో తొలి గోల్‌ సాధించగా.. జపాన్‌ ప్లేయర్‌ కెంజి కిటజటో నాలుగో నిమిషంలో గోల్‌ సాధించి స్కోరును సమం చేశాడు. అనంతరం మ్యాచ్‌ ఉత్కంఠగా సాగుంతుండగా భారత ఆటగాడు లలీల్‌ ఉపాధ్యాయ 22 నిమిషంలో గోల్‌ సాధించాడు. దీంతో భారత్‌ 2-1 తో ఆధిక్యం సాధించింది.

ఆ తర్వాతా భారత ఆటగాళ్లు జపాన్‌కు అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యాన్ని చలాయించారు. రమణ్‌దీప్‌ సింగ్‌ 33 నిమిషంలో మరో గోల్‌ సాధించగా.. హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ 35వ, 48 నిమిషాల్లో వరుస గోల్స్‌ సాధించడంతో భారత్‌ విజయం సులువైంది.  ఇటీవలె భారత హాకీ జట్టుకు కొత్త కోచ్‌ స్జోయెర్డ్ మరిజ్నేను నియమించిన విషయం తెలిసిందే‌. ఇక భారత్‌ తరువాతి మ్యాచ్‌  ఆతిథ్య బంగ్లాదేశ్‌తో శుక్రవారం తలపడనుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top