క్వార్టర్స్‌లో చిరెక్‌ స్కూల్‌ జట్లు | Chirec School Teams in Quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో చిరెక్‌ స్కూల్‌ జట్లు

Aug 25 2018 10:26 AM | Updated on Aug 25 2018 10:26 AM

సాక్షి, హైదరాబాద్‌: రెవరెండ్‌ ఫ్రాన్సిస్‌ దేవసియా బాస్కెట్‌బాల్‌ టోర్నమెంట్‌లో చిరెక్‌ బాలబాలికల జట్లు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నాయి. సెయింట్‌ ఫ్యాట్రిక్స్‌ స్కూల్‌ వేదికగా శుక్రవారం జరిగిన బాలుర ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో చిరెక్‌ పబ్లిక్‌ స్కూల్‌ 39–19తో డాన్‌బాస్కోపై గెలుపొందింది. చిరెక్‌ తరఫున అర్జున్‌ 17 పాయింట్లతో సత్తా చాటాడు. శౌర్య (12) ఆకట్టుకున్నాడు. డాన్‌బాస్కో జట్టులో యేసు 12 పాయింట్లు సాధించాడు. బాలికల ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో చిరెక్‌ పబ్లిక్‌ స్కూల్‌ 28–14తో సెయింట్‌ ఆంథోనీస్‌ బాలికల హైస్కూల్‌ను చిత్తుగా ఓడించింది. విజేత జట్టులో శ్రీయ (8), అనుష్క (4) రాణించారు.

ఇతర బాలుర ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో ఆతిథ్య సెయింట్‌ ప్యాట్రిక్స్‌ హైస్కూల్‌ (రేహాన్‌ 12, జేమ్స్‌8) 28–12తో సెయింట్‌ జోసెఫ్‌ హబ్సిగూడ (లోహిత్‌ 8)పై, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ (రోహన్‌ 13, రాఘవ్‌ 6) 30–29తో సెయింట్‌ పాల్స్‌ హైస్కూల్‌ (ఆంథోని 17)పై, ఫ్యూచర్‌కిడ్స్‌ (ఆద్యన్‌ 12, అనిశ్‌ 12) 39–18తో ఆల్‌సెయింట్స్‌ (వర్మ 8)పై, ఓక్రిడ్జ్‌ (రిషి 13, ఫరీద్‌ 7) 40–33తో ఎంజీఎం హైస్కూల్‌ (శ్రవణ్‌ 13, ఖాదిర్‌ 8)పై, సెయింట్‌ ఆండ్రూస్‌ హైస్కూల్‌ (బనియెల్‌ 23, శశాంక్‌ 6) 37–16తో జాన్సన్‌ గ్రామర్‌ స్కూల్‌ (హర్షిత్‌ 8, కపిల్‌ 6)పై, జాన్సన్‌ గ్రామర్‌ ఐసీఎస్‌ఈ (విష్ణు 8, సూర్య 8) 29–20తో గంగాస్‌వ్యాలీ (రితీష్‌ 11, కౌన్షిక్‌ 7)పై విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరుకున్నాయి.  

బాలికల ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌ల ఫలితాలు

ఓక్రిడ్జ్‌ న్యూటన్‌ (మేఘన 22) 24–20తో డాన్‌బాస్కో (సారా 17)పై, సెయింట్‌ జోసెఫ్‌ హబ్సిగూడ (యశస్విని 4, రాగమయి 4) 19–6తో ఆల్‌సెయింట్స్‌ హైస్కూల్‌పై, ఓక్రిడ్జ్‌ (స్వాతి 12) 20–9తో భారతీయ విద్యాభవన్‌ (స్నిగ్ధ 7)పై, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ (హర్షిత 17, కీర్తన 6) 35–13తో సెయింట్‌పాయ్స్‌ హైస్కూల్‌ (శ్రావ్య 4, తేజశ్రీ 4)పై, గీతాంజలి దేవ్‌శాల (తన్విత 8, జోషిక 6) 16–11తో గంగాస్‌ వ్యాలీ (సిధిక 7)పై గెలుపొందాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement