
ప్లే ఆఫ్‌కు చెన్నై సూపర్ కింగ్స్
సొంతగడ్డపై తిరుగులేదని మరోసారి నిరూపించుకున్న చెన్నై సూపర్‌కింగ్స్ ఐపీఎల్లో ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించింది.
► రాజస్తాన్ రాయల్స్‌పై గెలుపు
► రాణించిన మెకల్లమ్, జడేజా, మోహిత్
► బ్రేవో ఆల్‌రౌండ్ ప్రదర్శన
చెన్నై : సొంతగడ్డపై తిరుగులేదని మరోసారి నిరూపించుకున్న చెన్నై సూపర్‌కింగ్స్ ఐపీఎల్లో ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించింది. బ్యాటింగ్‌లో మెకల్లమ్ (61 బంతుల్లో 81; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), బౌలింగ్‌లో రవీంద్ర జడేజా (4/11), మోహిత్ శర్మ (3/25)... బ్రేవో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపడంతో... ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ధోనిసేన 12 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు చేసింది.
మెకల్లమ్ యాంకర్ పాత్రకు తోడు డు ప్లెసిస్ (25 బంతుల్లో 29; 3 ఫోర్లు) రాణించాడు. బ్రేవో (8 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు), ధోని (7 బంతుల్లో 13 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) మోస్తరుగా ఆడారు. 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన చెన్నైని మెకల్లమ్, డు ప్లెసిస్‌లు మూడో వికెట్‌కు 12.4 ఓవర్లలో 101 పరుగులు జోడించి ఆదుకున్నారు. చివర్లో ధోని, బ్రేవో ఆరో వికెట్‌కు 15 బంతుల్లో అజేయంగా 28 పరుగులు జోడించడంతో సూపర్‌కింగ్స్ గౌరవప్రద స్కోరు చేసింది.
మోరిస్ 3 వికెట్లు తీశాడు. తర్వాత రాజస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులకే మాత్రమే పరిమితమైంది. వాట్సన్ (30 బంతుల్లో 28; 2 ఫోర్లు) టాప్ స్కోరర్. రహానే (17 బంతుల్లో 23; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 37 పరుగులు జోడించారు. అయితే చెన్నై స్పిన్నర్లను ఎదుర్కొలేక వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో రాజస్తాన్ కోలుకోలేకపోయింది. చివర్లో శామ్సన్ (17 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్సర్లు), ఫాల్క్‌నర్ (13 బంతుల్లో 16; 2 ఫోర్లు)లు ఆరో వికెట్‌కు 33 పరుగులు జోడించి విజయంపై ఆశలు రేపారు. అయితే గెలవాలంటే చివరి 12 బంతుల్లో 33 పరుగులు చేయాల్సిన దశలో రాజస్తాన్ 20 పరుగులు మాత్రమే చేయగలిగింది.
స్కోరు వివరాలు
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ : స్మిత్ (సి) ఫాల్క్‌నర్ (బి) అంకిత్ 6; మెకల్లమ్ (సి) అంకిత్ (బి) మోరిస్ 81; రైనా (సి) ఫాల్క్‌నర్ (బి) మోరిస్ 3; డు ప్లెసిస్ రనౌట్ 29; నేగి (సి) స్మిత్ (బి) మోరిస్ 2; ధోని నాటౌట్ 13; బ్రేవో నాటౌట్ 15; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 157.
వికెట్ల పతనం : 1-12; 2-15; 3-116; 4-129; 5-129.
బౌలింగ్ : మోరిస్ 4-0-19-3; వాట్సన్ 2-0-19-0; అంకిత్ 4-0-31-1; తాంబే 3-0-24-0; ఫాల్క్‌నర్ 4-0-40-0; భాటియా 3-0-23-0.
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్ : రహానే (సి) బ్రేవో (బి) మోహిత్ 23; వాట్సన్ (సి) బ్రేవో (బి) జడేజా 28; స్మిత్ (బి) జడేజా 4; కరణ్ నాయర్ (సి) అశ్విన్ (బి) జడేజా 10; హుడా (సి) రైనా (బి) జడేజా 15; శామ్సన్ (సి) స్మిత్ (బి) బ్రేవో 26; ఫాల్క్‌నర్ (సి) బ్రేవో (బి) మోహిత్ 16; మోరిస్ నాటౌట్ 16; భాటియా (సి) డు ప్లెసిస్ (బి) మోహిత్ 0; అంకిత్ (సి) నెహ్రా (బి) బ్రేవో 0; తాంబే నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 145.
వికెట్ల పతనం : 1-37; 2-48; 3-63; 4-75; 5-90; 6-123; 7-130; 8-130; 9-143
బౌలింగ్ : నెహ్రా 4-0-29-0; మోహిత్ 4-0-25-3; నేగి 4-0-35-0; జడేజా 4-0-11-4; బ్రేవో 4-0-43-2.