సిడ్నీ ఆనవాయితీ కొనసాగేనా..? | chasing teams win at sydney cricket gound | Sakshi
Sakshi News home page

సిడ్నీ ఆనవాయితీ కొనసాగేనా..?

Mar 26 2015 1:17 PM | Updated on Sep 2 2017 11:26 PM

సిడ్నీ ఆనవాయితీ కొనసాగేనా..?

సిడ్నీ ఆనవాయితీ కొనసాగేనా..?

సిడ్నీకో ఆనవాయితీ ఉంది.

సిడ్నీ: సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాకు ఘనమైన రికార్డు ఉండొచ్చు. కంగారూలకిది అచ్చొచ్చిన గ్రౌండే కావచ్చు. ఈ వేదికపై భారత్, ఆసీస్ ఇంతకుముందు 13 మ్యాచ్లాడగా మనోళ్లు కేవలం ఒక్క మ్యాచే గెలిచి ఉండొచ్చు.  అయితే ఇటీవల సిడ్నీకో ఆనవాయితీ ఉంది.

సిడ్నీలో 2011 నుంచి ఈ వేదికపై 9 వన్డేలు జరగ్గా, ఛేజింగ్ చేసిన జట్లే నెగ్గాయి. ప్రపంచ కప్ తాజా సెమీస్ మ్యాచ్లోనూ ఇదే ఆనవాయితీ కొనసాగేనా? టీమిండియా విజయం సాధించి ఫైనల్ చేరేనా? ఈ ఆనవాయితీ నిజంకావాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఆస్ట్రేలియాతో సెమీస్ పోరులో భారత బౌలర్లు కీలక సమయంలో రాణించారు. దీంతో కంగారూలు మరింత భారీ స్కోరు చేసే ప్రమాదం తప్పింది.  మన బ్యాట్స్మెన్ విజృంభిస్తే విజయం సాధించడం అసాధ్యమేమీ కాదు. బెస్ట్ ఆఫ్ లక్ టీమిండియా.
 

Advertisement
 
Advertisement
Advertisement