ఐపీఎల్ -9 విజేత ఎవరంటే..? | Can Kohli-led RCB win first title? | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ -9 విజేత ఎవరంటే..?

Apr 18 2016 8:54 AM | Updated on Sep 3 2017 10:08 PM

ఐపీఎల్ -9 విజేత ఎవరంటే..?

ఐపీఎల్ -9 విజేత ఎవరంటే..?

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్ సీబీ)కే టైటిల్ కైవసం చేసుకునే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని బుక్ మేకర్స్ అభిప్రాయపడ్డారు.

బెంగళూరు: ఐపీఎల్ -9లో లీగ్ మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ సీజన్ ఉత్కంభరిత పోరు ఇంకా ఎదురుకానప్పటికీ మ్యాచ్ లకు ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు. చెన్నై, రాజస్థాన్ జట్ల రద్దు కాగా, వాటి స్థానంలో గుజరాత్, పుణే బరిలో నిలిచాయి. ఈసారి మాత్రం టైటిల్ బెంగళూరుదే అంటున్నారు బుక్ మేకర్స్. విరాట్ కోహ్లి నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్ సీబీ)కే టైటిల్ కైవసం చేసుకునే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. పంజాబ్ ఈసారి చివరిస్థానంతో సరిపెట్టుకుంటుందని అంచనా వేశారు. బుక్ మేకర్స్ అభిప్రాయాలు ఆధారంగా ఆయా జట్ల విజయావకాశాలు ఈ విధంగా ఉన్నాయి.

బెంగళూరు- 29 శాతం
గుజరాత్- 19 శాతం
ముంబై- 14 శాతం
పుణే- 13 శాతం
కోల్ కతా-12 శాతం
ఢిల్లీ- 6 శాతం
హైదరాబాద్-5 శాతం
పంజాబ్ - 4 శాతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement