ఆ ఇద్దరు క్రికెటర్లకు ఊరట! | Butt, Asif named in players' draft for Pakistan Super League | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరు క్రికెటర్లకు ఊరట!

Oct 8 2016 12:14 PM | Updated on Sep 4 2017 4:40 PM

ఆ ఇద్దరు క్రికెటర్లకు ఊరట!

ఆ ఇద్దరు క్రికెటర్లకు ఊరట!

స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కుని దాదాపు ఐదు సంవత్సరాలు నిషేధం ఎదుర్కొన్న పాకిస్తాన్ క్రికెటర్లు సల్మాన్ భట్, మొహ్మద్ ఆసిఫ్ లకు కాస్త ఉపశమనం లభించించింది.

కరాచీ:స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కుని దాదాపు ఐదు సంవత్సరాలు నిషేధం ఎదుర్కొన్న పాకిస్తాన్ క్రికెటర్లు సల్మాన్ భట్, మొహ్మద్ ఆసిఫ్ లకు కాస్త ఉపశమనం లభించించింది. ఆ ఇద్దరు పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఆడేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) క్లియరెన్స్ ఇచ్చింది. దాంతో రెండో సీజన్ పీఎస్ఎల్ కోసం ఆ ఇద్దరు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

గతేడాది పీఎస్ఎల్ నాటికి  వీరికి స్పాట్ ఫిక్సింగ్ పై నిషేధం పూర్తయినా ఆడేందుకు అవకాశం దక్కలేదు. ఆ ఇద్దరిపై నిషేధం పూర్తయ్యే సరికి పీఎస్ఎల్ వేలం పూర్తికావడంతో వారికి ఆడే అవకాశం లభించలేదు. ప్రస్తుతం పీసీబీ తీసుకున్న నిర్ణయం తమకు ఎంతగానో ఉపకరిస్తుందని సల్మాన్ భట్ పేర్కొన్నాడు.  తాము చేసిన తప్పులు అనేవి గతమని భట్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. తాను ఇప్పుడు మానసికంగా చాలా బలంగా ఉన్నానని, ఇక జీవితంలో అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఈ మాజీ కెప్టెన్ తెలిపాడు.  అంతకుముందు మొహ్మదల్ ఆమిర్ కూడా ఫిక్సింగ్ ఆరోపణలతో ఐదేళ్లు నిషేధం ఎదుర్కొన్న తరువాత పాకిస్తాన్ జాతీయ జట్టులోకి పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement