టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్‌మనీని గత ఏడాదితో పోలిస్తే ....
సింగిల్స్ విజేతలకు రూ. 18 కోట్ల 24 లక్షలు
తొలి రౌండ్‌లో ఓడినవారికి రూ. 24 లక్షలు
మెల్‌బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్‌మనీని గత ఏడాదితో పోలిస్తే ఈసారి 14 శాతం పెంచారు. ఈ సంవత్సరం 5 కోట్ల ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ. 246 కోట్లు) ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్నట్లు టోర్నీ డైరెక్టర్ క్రెయిగ్ టిలే తెలిపారు.
పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 37 లక్షల (రూ. 18 కోట్ల 24 లక్షలు) డాలర్ల చొప్పున అందజేస్తారు. తొలి రౌండ్‌లో ఓడినవారికి 50 వేల డాలర్లు (రూ. 24 లక్షల 65 వేలు) ఇవ్వనున్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ జనవరి 16 నుంచి 29 వరకు మెల్‌బోర్న్‌లో జరుగుతుంది.