
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ తన భార్య కైల్ బోల్డీతో విడిపోయాడు. తామిద్దరం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు క్లార్క్ ప్రకటించాడు. 2012లో క్లార్క్, బోల్డీకి వివాహమైంది. వీరిద్దరికి కెల్సీ లీ అనే నాలుగేళ్ల పాప ఉంది. విడాకులు తీసుకున్నందుకు భరణంగా క్లార్క్ 40 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 285 కోట్లు) చెల్లించనున్నట్లు సమాచారం. . వీరికి ప్రస్తుతం నాలుగేళ్ల కుమార్తె కెల్సే ఉన్నారు. ఆసీస్ తరఫున 115 టెస్టులు, 245 వన్డేలు ఆడిన క్లార్క్ 2015లో జట్టును ప్రపంచకప్ విజేతగా నిలిపాడు.