హైదరాబాద్ కెప్టెన్‌గా ఆశిష్ రెడ్డి | asish reddy to lead hyderabad cricket team | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ కెప్టెన్‌గా ఆశిష్ రెడ్డి

Jul 31 2016 2:58 PM | Updated on Sep 7 2018 2:09 PM

ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్‌కు హైదరాబాద్ జట్టును ప్రకటించారు.

బుచ్చిబాబు క్రికెట్ టోర్నీకి జట్టు ఎంపిక
 
 సాక్షి, హైదరాబాద్: ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్‌కు హైదరాబాద్ జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు ఆశిష్ రెడ్డి కెప్టెన్‌గా, తన్మయ్ అగర్వాల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. 2016-17 సీజన్‌లో ఇదే తొలి టోర్నీ. వచ్చే నెల 5 నుంచి 18వ తేదీ వరకు చెన్నైలో ఈ టోర్నీ జరుగుతుంది. ఎంపికైన జట్టు సభ్యులందరూ ఆదివారం ఉదయం 9 గంటలకల్లా ఉప్పల్ స్టేడియంలో కోచ్ అర్జున్ యాదవ్‌కు రిపోర్టు చేయాలి.


 జట్టు: ఆశిష్ రెడ్డి (కెప్టెన్), అక్షత్ రెడ్డి, తన్మయ్ అగర్వాల్, అనిరుధ్, బి. సందీప్, కొల్లా సుమంత్, మెహదీ హసన్, విశాల్ శర్మ, ఆకాశ్ భండారి, సి.వి.మిలింద్, రవి కిరణ్, సిరాజ్, డానీ డెరిక్ ప్రిన్స్, బెంజమిన్ థామస్, యతిన్ రెడ్డి, హబీబ్ అహ్మద్; స్టాండ్‌బైస్: ముదస్సిర్ హుస్సేన్, టి. రవితేజ, పి.సాకేత్ సాయిరామ్, రోహిత్ రాయుడు, తనయ్ త్యాగరాజన్, కోచ్: అర్జున్ యాదవ్, అసిస్టెంట్ కోచ్: జకీర్ హుస్సేన్, మేనేజర్: సూర్యప్రకాశ్.

Advertisement
 
Advertisement
Advertisement