ఆసియా కప్‌ ట్రోఫీ ఆవిష‍్కరణ

Asia Cup 2018 Trophy Unveiled In Dubai - Sakshi

న్యూఢిల్లీ: మరో వారం రోజుల్లో యూఏఈ వేదికగా ఆసియా కప్‌-2018 టోర్నీ ఆరంభం కానుంది.  ఈ నేపథ్యంలో ఆసియా కప్‌ ట్రోఫీని యూఏఈ సాం‍స్కృతిక మంత్రిత్వ శాఖ శుక్రవారం దుబాయ్‌లో ఆవిష్కరించింది. మంత్రి షేక్‌ నయన్‌ బిన్‌ ముబారక్‌ ఆల్‌ నయన్‌ ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించిన  వీడియోను భారత క్రికెట్‌ టీమ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా షేర్‌ చేసింది.

ఈ నెల 15 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్‌ టోర్నీ జరగనుంది. మొత్తం ఆరు జట్లు తలపడే ఈ టోర్నీలో భారత్‌ జట్టు తన తొలి మ్యాచ్‌ను 18వ తేదీన హాంకాంగ్‌తో ఆడనుంది. ఆ తర్వాతి రోజే భారత్‌ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. ఈ టోర్నీకి భారత క్రికెట్‌ జట్టు రెగ్యులర్‌ కెప్టెన్‌ కోహ్లికి విశ్రాంతినిచ్చారు. విరామం లేకుండా క్రికెట్‌ ఆడుతున్న కోహ్లికి రెస్ట్‌ ఇచ్చిన మేనేజ్‌మెంట్‌.. అతని స్థానంలో రోహిత్‌ శర్మకు సారథ్య బాధ్యతలు అ‍ప్పజెప్పింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top