‘నిథమ్‌’ చెస్‌ టోర్నీ విజేత అనికేత్‌ | anikit wins chess title | Sakshi
Sakshi News home page

‘నిథమ్‌’ చెస్‌ టోర్నీ విజేత అనికేత్‌

Feb 5 2018 10:38 AM | Updated on Feb 5 2018 10:38 AM

anikit wins chess title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిథమ్‌ ఆలిండియా ఓపెన్‌ ఫిడే రేటెడ్‌ చెస్‌ టోర్నీలో అహిర్వర్‌ అనికేత్‌ (మధ్యప్రదేశ్‌) విజేతగా నిలిచాడు. తెలంగాణ రాష్ట్ర చెస్‌ సంఘం (టీఎస్‌సీఏ), నిథమ్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌) సంయుక్తంగా గచ్చిబౌలిలో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో అహిర్వర్‌ అనికేత్‌ అగ్రస్థానం దక్కించుకోగా సుమన్‌ (పశ్చిమబెంగాల్‌) రెండో స్థానంలో, యశోదర్శన్‌ కల్మనూర్‌ (తెలంగాణ) మూడో స్థానంలో నిలిచారు. విజేతలకు వరుసగా రూ. 50 వేలు, 40 వేలు, 30 వేల నగదు బహుమతులు లభించాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో నిథమ్‌ చైర్మెన్‌ బి. వెంకటేశం విజేతలకు నగదు పురస్కారాలతో పాటు ట్రోఫీలు అందేజేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement