మాథ్యూస్‌ డబుల్‌ సెంచరీ | Angelo Mathews Scored A double Century In His Test Career | Sakshi
Sakshi News home page

మాథ్యూస్‌ డబుల్‌ సెంచరీ

Jan 23 2020 3:22 AM | Updated on Jan 23 2020 10:00 AM

Angelo Mathews Scored A double Century In His Test Career - Sakshi

హరారే: ఎంజెలో మాథ్యూస్‌ టెస్టు కెరీర్‌లో తొలిసారి డబుల్‌ సెంచరీ (200 నాటౌట్‌; 16 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కదం తొక్కడంతో... జింబాబ్వేతో జరుగుతోన్న తొలి టెస్టులో శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 519 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. దాంతో శ్రీలంక 157 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన జింబాబ్వే బుధవారం ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 30 పరుగులు చేసింది.

ప్రిన్స్‌ మస్వౌరే (15 బ్యాటింగ్‌; 2 ఫోర్లు), బ్రియాన్‌ ముద్జింగన్‌యమ (14 బ్యాటింగ్‌; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 295/4తో నాలుగో రోజు ఆట కొనసాగించిన శ్రీలంకను మాథ్యూస్‌ ముందుకు నడిపించాడు. అతడు ధనంజయ డిసిల్వా (63; 7 ఫోర్లు)తో కలిసి ఐదో వికెట్‌కు 98 పరుగులు... డిక్వెల్లా (63; 3 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్‌కు 136 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే మాథ్యూస్‌ 272 బంతుల్లో శతకాన్ని, 468 బంతుల్లో ద్విశతకాన్ని పూర్తి చేసుకున్నాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement