రాణించిన అభిమాన్ | abhiman successful in batting order | Sakshi
Sakshi News home page

రాణించిన అభిమాన్

Dec 13 2013 12:17 AM | Updated on Sep 2 2017 1:32 AM

వీనస్ సైబర్ టెక్ బ్యాట్స్‌మన్ అభిమాన్ (75) అర్ధ సెంచరీతో రాణించాడు. ఎంసీసీ జట్టుతో ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వీనస్ సైబర్ టెక్ 226 పరుగులకు ఆలౌటైంది.

జింఖానా, న్యూస్‌లైన్: వీనస్ సైబర్ టెక్ బ్యాట్స్‌మన్ అభిమాన్ (75) అర్ధ సెంచరీతో రాణించాడు. ఎంసీసీ జట్టుతో ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వీనస్ సైబర్ టెక్ 226 పరుగులకు ఆలౌటైంది. వంశీ రెడ్డి (45 నాటౌట్), ప్రదీప్ (30) మెరుగ్గా ఆడారు.
 
 ఎంసీసీ బౌలర్ రాజా వెంకటేశ్ 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన ఎంసీసీ ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో బౌలర్ విజయ్ (4/28) తన బౌలింగ్‌తో వీపీ విల్లోమెన్ జట్టును కట్టడి చేసినప్పటికీ సాగర్ ఎలెవన్ జట్టుకు పరాజయం తప్పలేదు. మొదట బ్యాటింగ్ చేసిన సాగర్ ఎలెవన్ 156 పరుగులకు కుప్పకూలింది. ఖాను మెహర్ (57 నాటౌట్) అర్ధ సెంచరీతో ఆజేయంగా నిలవగా... విజయ్ నాయక్ 37 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. త ర్వాత బరిలోకి దిగిన వీపీ విల్లోమెన్ 9 వికెట్లకు 157 పరుగులు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement