దొంగతో యుద్ధం.. సీసీ కెమెరాల గెలుపు | thief steps back after fighting with cc cameras | Sakshi
Sakshi News home page

దొంగతో యుద్ధం.. సీసీ కెమెరాల గెలుపు

Feb 12 2019 4:25 PM | Updated on Feb 12 2019 4:57 PM

thief steps back after fighting with cc cameras - Sakshi

దొంగతనం చేయడానికి ఓ షాపును ఎంచుకున్నాడు ఓ దొంగ. నెమ్మదిగా షాపులో దూరడానికి ప్రయత్నించాడు. కొంత దూరంలో తన అడుగుల కోసమే ఎదురు చూస్తున్న ఓ సీసీకెమెరాని గమనించాడు. కదలలేని శత్రువే, కానీ దాని కంటికి చిక్కానో ఇక అంతే అని భావించి చేతికి దొరికిన ఓ పరికరంతో యుద్ధం ప్రకటించాడు ఆ దొంగ. దానికి చిక్కకుండా ఆ పరికరంతో మొహాన్ని దాచుకుంటూ ముందుకు నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. అయితే మధ్యలోకి రాగానే పక్కనే ఎవరో ఉన్నారని అనిపించి, టక్కున తిరిగి చూశాడు. అంతే అక్కడ మరో సీసీకెమెరాను చూసి దొంగ గుండె గుబేలుమంది. సీసీకెమెరాలతో జరిగిన పోరులో ఏం చేయలేని నిస్సహాయస్థితిలో అక్కడి నుంచి తోకముడుచుకుని పారిపోయాడు. దీనికి సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement