
హైదరాబాద్ : ఉమెన్స్ సేప్టీ వింగ్ ఐజీ స్వాతి లక్రా తన డ్యూటీలో ఎంత సిన్సియర్‌గా ఉంటారో సామాజిక మాధ్యమాల్లో కూడా అంతే చురుకుగా ఉంటారు. తాజాగా ఆమె ట్విటర్లో షేర్ చేసిన వీడియో గ్రామీణ భారతం, పనిపట్ల శ్రద్ధ ఎలా ఉండాలనే విషయాన్ని గురించి చెబుతుంది. అంతెత్తున్న గోడపై ఓ మహిళ.. అలవోకగా పిడకలు వేస్తున్న నైపుణ్యం పట్ల స్వాతి లక్రా అబ్బుర పడ్డారు. ‘వావ్..! ఎంత కచ్చితత్వం’అని క్యాప్షన్ పెట్టి వీడియోను షేర్ చేశారు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అమ్మ ప్రతిభకు జోహార్లు అని కొందరు, అసలైన భారత్ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉందని మరికొందరు పేర్కొన్నారు.
WOW, What accuracy! pic.twitter.com/8HxuLX2yd3
— Swati Lakra IPS (@IGWomenSafety) February 5, 2020