ఏపీపై కేంద్రం సవతి ప్రేమ: విజయసాయిరెడ్డి

YSRCP MP Vijayasai Reddy Urges Centre Help to AP Economically - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ పక్ష నాయకుడు విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో గురువారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్రం ఇప్పటికీ అమలు చేయలేదని గుర్తుచేశారు.

విభజనతో నష్టపోయిన ఏపీని కేంద్రం ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ప్రణాళిక సంఘం ఎక్కడా చెప్పలేదని ఆయన సభలో స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎన్డీయే ప్రభుత్వ మంత్రులు, ఆ కూటమి ఎంపీలు ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. రైల్వే జోన్‌ కేటాయింపులోనూ ఏపీకి అన్యాయం జరిగిందని, విశాఖకు రైల్వే జోన్‌ ఇస్తానని కేంద్రం మాట తప్పిందని గుర్తు చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top