
సాక్షి, కృష్ణా: ఉంగుటూరు పోలీసు స్టేషన్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత యలమంచిలి రవి ఆదివారం సాయంత్రం విడుదలయ్యారు. జై ఆంధ్ర ఉద్యమనేత కాకాని వెంకటరత్నం విగ్రహం తొలిగించేందుకు అధికారులు ప్రయత్నించడంతో.. వారిని యలమంచిలి రవి అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయనను అరెస్టు చేసి.. ఉంగటూరు పోలీసు స్టేషన్‌ను తరలించారు. అంతకుముందు విగ్రహ కమిటీకి చెప్పకుండా కాకాని విగ్రహాన్ని ఎలా తొలగిస్తారని యలమంచిలి పోలీసులను నిలదీశారు. ప్రొక్లైనర్‌ను అడుకుని పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. దీంతో యలమంచిలి రవిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత భారీ బందోబస్తు మధ్య కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని అధికారులు అక్కడి నుంచి తొలగించారు. ఈ క్రమంలో ఉంగుటూరు పోలీసు స్టేషన్‌లో ఉన్న యలమంచలి రవిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పార్థసారథి, మల్లాది విష్ణు పరామర్శించారు. ఆ తర్వాత సాయంత్రం యలమంచలి రవి పీఎస్ నుంచి విడుదలయ్యారు.