బీజేపీ-టీడీపీకి ఉన్న అనుబంధం ఏంటి?

YSRCP Leader Parthasarathy Fires On Chandrababu Over Polavaram - Sakshi

సాక్షి, విజయవాడ : ఏపీకి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును టీడీపీ గాలికొదిలేసిందని వైఎస్సార్‌సీపీ నేత పార్ధసారథి విమర్శించారు. అత్యంత ప్రాధాన్యత గల ప్రాజెక్టును కేవలం ఆర్భాటానికి, ప్రచారానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ పోలవరం ప్రాజెక్టు లోపాలకు కేంద్ర బృందం ఎత్తిచూపింది. రోజుకు 10 కోట్ల నుంచి 20 కోట్ల పనులు జరుగుతున్నాయి. అయినా సరే ప్రభుత్వం నాణ్యతను పట్టించుకోవడంలేదు. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన స్పిల్‌వేలో గ్యాపులు ఉన్నాయి. కంకర తప్ప మరేమి కనబడడంలేదు. ప్రాజెక్టు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ముడుపులు ఇచ్చేవారికే సబ్‌ కాంట్రాక్టులు ఇస్తున్నారు.

నిర్మాణంలో నాసిరకం సిమెంట్‌ ఉపయోగిస్తున్నారు. పర్మింట్‌ క్వాలిటి డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేయాలి. 112.45 కోట్లు ఏలాంటి పనులు జరగకుండా దొచ్చుకున్నారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ఉత్తర్వులు ఇస్తున్నారు. టీడీపీ-బీజేపీకి ఉన్న లోపాయికారి ఒప్పందం వల్లనే బీజేపీ కళ్లు మూసుకుని ఉంది. వారిమధ్య ఉ‍న్న అనుబంధం ఏంటి?. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పోలవరం అవకతవకలపై విచారణ జరిపించాలి’’ అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top