చంద్రబాబు 420-1, ఆ మంత్రి 420-2

YSRCP Leader Jogi Ramesh Slams Minister Devineni Uma - Sakshi

పట్టిసీమ ప్రాజెక్టుపై  మంత్రి దేవినేని అసత్య ప్రచారం

వదినను పొట్టన పెట్టుకున్న చరిత్ర దేవినేనిది

బాబు, లోకేష్‌ అవినీతిపరులకు మద్య బ్రోకర్‌ పనులు చేస్తున్నాడు

వైస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి, సీనియర్‌ నేత జోగి రమేష్‌

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీరుపై వైస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి, సీనియర్‌ నేత జోగి రమేష్‌ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు 420-1 అయితే  దేవినేని 420-2 అని మండిపడ్డారు. పట్టిసీమ ప్రాజెక్టుపై  మంత్రి దేవినేని అసత్య ప్రచారాలకు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. పట్టిసీమ ద్వారా రైతులు లబ్ది పొందారని చెప్పడం అంతా అబద్ధం అని, దీనిపై దమ్ముంటే చర్చలకు సిద్ధమవ్వాలని సవాల్‌ విసిరారు. సోమవారం ఉదయం 10 గంటలకు మంత్రి బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.

పదవుల కోసం దేవినేని ఉమ, తల్లిలాంటి వదినను పొట్టన పెట్టుకున్నారంటూ ఆరోపించారు. మైలవరంలో మహిళలకు గుక్కెడు మంచినీరు ఇవ్వలేని దద్దమ్మ మంత్రి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేవినేని మంత్రి కాదని, ముఖ్యమంత్రికి, లోకేష్‌కు, అవినీతిపరలకు మద్య బ్రోకర్‌ పనులు చేస్తున్నారంటూ విమర్శించారు. దేవినేని నోరు అదుపులో ఉంచుకోవాలని, లేకపోతే ప్రజలు తోలు తీస్తారని హెచ్చరించారు. నాలుగు ఏళ్లుగా గాలి జనార్థన్‌ రెడ్డితో సింగపూర్‌లో చంద్రబాబు కలుస్తున్నారని ఆరోపించారు. గాలి జనార్దన​ రెడ్డి, చంద్రాబాబు నాయుడు పాస్‌పోర్టులు ప్రజలకు చూపించగలరా అని ఆయన నిలదీశారు. 

నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాను తుంగలో తొక్కి ఇప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ దీక్షలు చేస్తున్నారని జోగి రమేష్‌ విమర్శించారు. చేపలను మభ్యపెట్టడానికి కొంగ దీక్షలు చేపట్టే విధంగా  సీఎం కూడా దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని, అందుకే ఆయన చేపట్టిన దీక్షలకు ప్రజలు మొహం చాటుతున్నారని అన్నారు. బాబు దీక్షలకు బస్సులు పెట్టి ప్రజలను తరలిస్తున్నారని మండిపడ్డారు. కేసుల నుంచి బయట పడటానికి చంద్రబాబు గంటన్నర పాటు గవర్నర్‌ కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top