అక్టోబర్‌1లోపు నీరు విడుదల చేయాలి: వైఎస్సార్‌సీపీ

 YSRCP demands the release of Srisailam water for Rayalaseema - Sakshi

సాక్షి, మైదుకూరు: శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి కేసీ కెనాల్‌, తెలుగు గంగలకు నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు శనివారం ధర్మా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. రాయలసీమ అందులోనూ కడప జిల్లాను సీఎం చంద్రబాబు శత్రుస్థానంగా చూస్తున్నారని ఆరోపించారు. శ్రీశైలంలో సరిపడ నీళ్లున్నా ఎందుకు విడుదల చేయడంలేదని ప్రశ్నించారు.

రాయలసీమపై వివక్ష వీడాలని, కడప జిల్లాకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే తామే గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తామని హెచ్చరించారు. అక్టోబర్‌ 1 లోపు నీటి విడుదల జరగకపోతే 2వ తేదిన 48 గంటల నిరహార దీక్ష చేపడతామన్నారు. ఈ ధర్మాలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామి రెడ్డి, రాచమల్లు ప్రసాద్‌ రెడ్డి, అంజాద్‌ బాషా, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top