ఖరారైన విజయమ్మ, షర్మిల ప్రచార షెడ్యూల్‌

YS Jagan and Vijayamma Election Campaign Schedule For April 4th 2019 - Sakshi

సాక్షి, అమరావతి : ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రేపటి(గురువారం) ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 4న నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని నాలుగు నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు. గురువారం ఉదయం 9.30 గంటలకు నెల్లూరు పట్టణంలో పర్యటిస్తారు. అనంతరం ఉదయం 11.30 గంటలకు కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రచారం చేస్తారు.

మధ్యాహ్నం 1.30 గంటలకు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు హిందూపురంలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రచారం చేస్తారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రకటన విడుదల చేశారు.

షర్మిల ప్రచార షెడ్యూల్‌..
షర్మిల పశ్చిమ గోదావరి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో, మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. ఉదయం 9.30 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గం, నర్సాపురం పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు ఉంగటూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని నారాయణపురం గ్రామంలో, ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు.

అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు ఉంగటూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని గుండుగొలను గ్రామంలో, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో బహిరంగ సభల్లో పాల్గొంటారు. తర్వాత సాయంత్ర 6.10 గంటలకు గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని దేవరపల్లి గ్రామంలో, రాజమండ్రి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తారు. చివరకు రాత్రి 8.20 గంటలకు నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం, రాజమండ్రి పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు.

విజయమ్మ ప్రచార షెడ్యూల్‌..
వైఎస్సార్‌సీపీ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రచార షెడ్యూలు కూడా ఖరారైంది. విజయమ్మ ఈ నెల 4న పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. తొలుత పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం, కాకినాడ పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. అనంతరం జిల్లాలోని జగ్గమ్మపేట అసెంబ్లీ నియోజకవర్గం, కాకినాడ పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top