మసూద్‌ను విడుదల చేసిందెవరు?

Who released Masood Azhar from jail - Sakshi

ప్రధాని మోదీకి రాహుల్‌ ప్రశ్న

న్యూఢిల్లీ: ఉగ్రదాడికి బాధ్యత వహిస్తున్న మసూద్‌ అజార్‌ను విడుదల చేసిందెవరో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల కుటుంబాలకు చెప్పాలని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని నిలదీశారు. ప్రస్తుతమున్న జాతీయ భద్రతా సలహాదారే కాందహార్‌కు వెళ్లి అజార్‌ను పాకిస్తాన్‌కు అప్పగించినట్లు రాహుల్‌ ట్విట్టర్‌ వేదికగా ఆరోపించారు. కాందహార్‌లో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్‌ ఐసీ–814ను ఉగ్రవాదులు హైజాక్‌ చేసి అందులో ప్రయాణిస్తున్న 150 మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. వీరిని విడిపించడానికి బదులుగా అప్పటి భారత ప్రభుత్వం 1999, డిసెంబర్‌లో అజార్‌తో పాటు మరి కొంతమంది ఉగ్రవాదులను విడుదల చేసింది. ‘మోదీ జీ మసూద్‌ను విడుదల చేసిందెవరో 40 మంది జవాన్ల కుటుంబాలకు చెప్పండి. అలాగే కాందహార్‌ వెళ్లి అజా ర్‌ను పాకిస్తాన్‌కు అప్పగించింది కూడా జాతీ య భద్రతా సలహాదారేనని చెప్పండి’అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top