‘వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే’

We Will Form Government In Centrally Again Says Prakash Javadekar - Sakshi

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌

డెహ్రాడూన్‌: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ పేర్కొన్నారు. 2019 ఎన్నికల తరువాత కూడా తమ పార్టీ బలంగా ఉంటుందన్నారు. డెహ్రాడూన్‌లో ఓ కార్యక్రమంలో జవదేకర్‌ మాట్లాడారు. ఉపఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఉప ఎన్నికల ఫలితాలు స్థానిక పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని వాటి ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఏమాత్రం పడదన్నారు.  

ఉప ఎన్నికల్లో ఓడినంతమాత్రాన మోదీ ప్రభావం తగ్గినట్లు కాదన్నారు. ఇటీవల జరిగిన ఏ ఉప ఎన్నికల ప్రచారంలో కూడా మోదీ పాల్గొన్నలేదని గుర్తుచేశారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే 2019లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని, బెంగాల్‌, ఒడిషా, కేరళ రాష్ట్రాల్లో కూడా గెలుస్తామని పేర్కొన్నారు.  నాలుగేళ్లలో తమ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తోందిని, ఏ మంత్రిపై కూడా అవినీతి ఆరోపణలు రాలేదని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలకు ప్రభుత్వం వందశాతం నిధులు విడుదల చేస్తోందని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top