సున్నా వడ్డీ రుణాలపై చర్చకు సిద్ధం: సీఎం జగన్‌

we are ready to discuss on Zero Interest Loan for Farmers, says YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: సున్నా వడ్డీ పథకంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చకు అనుమతించాలంటూ ఆయన ఈ సందర్భంగా స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కు విజ్ఞప్తి చేశారు. సభా నాయకుడి అభ్యర్థన మేరకు సున్నా వడ్డీ పథకంపై స్పీకర్‌ అనుమతి ఇచ్చారు. సభా సాక్షిగా సున్నా వడ్డీ పథకంపై  నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం వైఎస్‌ జగన్‌ చెబుతూ....  సున్నా వడ్డీకి జవాబు చెప్పలేకే చంద్రబాబు సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. టీడీపీ సున్నావడ్డీపై తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయన్నారు. సున్నా వడ్డీ పథకంపై టీడీపీ చెప్పాల్సిందంతా చెప్పనీయండని, ఆ తర్వాతే ఆ పథకంపై తాము వివరణ ఇస్తామని తెలిపారు.

కాగా సున్న వడ్డీ రుణాలపై ముఖ్యమంత్రి సభను తప్పుదోవ పట్టించారంటూ టీడీపీ సీఎంపై సభా హక్కుల నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి సున్నా వడ్డీ పథకంపై తాము నిన్న సభలో  (గురువారం) చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు ఆందోళనపై స్పీకర్‌ అసహనం వ్యక్తం చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top